యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్లకు హీరోయిన్ గా సరైన బ్రేక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి చేసిన ఓ 20 నిమిషాల సీన్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో ఆమె పేరు మారుమోగింది. ప్రస్తుతం ఆమె బీటౌన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. 2023లో విడుదలైన యానిమల్ సినిమాతో ఈ ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో రణబీర్, త్రిప్తి డిమ్రీ మధ్య వచ్చే సీన్ ఎంత సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. దీంతో ఆమె పేరు మారుమోగింది. ఈరోజు త్రిప్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ తారలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన తృప్తి ఢిల్లీలో చదువుకుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తృప్తి యూట్యూబ్ సృష్టికర్త అని, ‘విప్రా డైలాగ్స్’ ఛానెల్‌లో పలు ప్రకటనలలో నటించింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో తన అనుభవాల తర్వాత, ఆమె మోడలింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె ‘యానిమల్’ చిత్రంలో బాబీ డియోల్ సోదరుడిగా నటించిన సౌరభ్ సచ్‌దేవా నుండి నటన పాఠాలు నేర్చుకుంది. ఆమె 2017 లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సన్నీ డియోల్, బాబీ డియోల్ చిత్రం ‘పోస్టర్ బాయ్స్’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత లైలా మజ్ను, బుల్బుల్, కాలా చిత్రాలతో మరింత ఫేమస్ అయ్యింది. యానిమల్ సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇటీవలే భూల్ భూలయ్యా 3 చిత్రంలో నటించింది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన