Tollwood: ఒక్క పాటకు రూ.50 లక్షలు.. ఇండియాలో అధికంగా రెమ్యునరేషన్ తీసుకునే కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా.. ?

Tollwood: ఒక్క పాటకు రూ.50 లక్షలు.. ఇండియాలో అధికంగా రెమ్యునరేషన్ తీసుకునే కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా.. ?


సాధారణంగా సినిమాలకు మ్యూజిక్ ప్రాణం. కొన్ని సందర్భాలలో కేవలం పాటలతోనే మ్యూజికల్ హిట్స్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఒక్కో సినిమాకు సంగీత దర్శకులు సైతం భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. కానీ ఒక్క పాటకు డ్యాన్స్ నేర్పించే ఒక కొరియోగ్రాఫర్ ఎంత వసూలు చేస్తాడో ఎవరికైనా తెలుసా.. ? నిజానికి ఒక పాటలో హీరోహీరోయిన్స్ తెరపై ఎలా కనిపిస్తారు అనే విషయాన్ని దర్శకులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే ఇప్పుడు సినిమాకు కొరియోగ్రాఫర్స్ చాలా ముఖ్యమైనవారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. కానీ అధికంగా పారితోషికం తీసుకునే కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. ఆమె దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న కొరియోగ్రాఫర్. నివేదికల ప్రకారం ఆమె ఒక పాటకు రూ.50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఆ తర్వాత రెమో డిసౌజా, గణేష్ హెగ్డే, వైభవి మర్చంట్ సైతం ఎక్కువగా వసూలు చేస్తారు. డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఫరా ఖాన్ మొదటి చిత్రం జల్వా. ఆతర్వాత కబీ హాన్ కభీ నాలో సినిమాతో ఫేమస్ అయ్యింది. కెరీర్ తొలి నాళ్లల్లో ఆరు పాటలకు కొరియోగ్రఫీ చేసినందుకు తనకు రూ. 30,000 తీసుకున్నట్లు తెలిపింది.

కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా నటిగా, దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. నివేదికల ప్రకారం ఫరా ఖాన్ ఆస్తుల విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *