Telangana: రాజలింగమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Telangana: రాజలింగమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు


సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యకు ముందే ప్లాన్‌ చేసిన నిందితులు.. వరంగల్‌లోని కాశీబుగ్గలో కత్తులు, రాడ్లు కొనుగోలు చేసినట్లు భూపాలపల్లి పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైక్‌లు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కలిసి హత్య చేయగా.. ఇద్దరు రెక్కీ నిర్వహించారు. మరో ముగ్గురు.. నిందితులకు సహాయం చేసినట్లు పోలీసులు తేల్చారు.

రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌ కీలక విషయాలు వెల్లడించారు. రాజలింగమూర్తి హత్యకు భూవివాదమే కారణమని తెలిపారు. ఎకరం భూమి విషయంలో సంజీవ్‌, రాజలింగమూర్తి మధ్య కొన్నాళ్లుగా భూవివాదం కొనసాగుతుందని చెప్పారు. ప్లాన్‌ ప్రకారం కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి రాజలింగమూర్తిని హత్య చేశారన్నారు ఎస్పీ కిరణ్‌.

రాజలింగమూర్తి హత్యకు కొత్త హరిబాబు అనే వ్యక్తి ప్లాన్‌ చేసినట్లు గుర్తించామన్నారు ఎస్పీ కిరణ్‌. ప్రధాన నిందితుడు సంజీవ్‌కు హరిబాబు సపోర్ట్‌ చేశారని.. పరారీలో ఉన్న ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రాజలింగమూర్తి మర్డర్‌కు సంబంధించి ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతుందన్నారు ఎస్పీ కిరణ్‌. ఈ నెల 19న రాత్రి సుమారు 7 గంటల సమయంలో రాజలింగమూర్తి హత్యకు గురైన  విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *