Telangana: మిస్‌ వరల్డ్‌ అందగత్తెల భద్రత కోసం ఆపరేషన్ మంకీస్..అక్కడున్న కోతుల తరలింపు!

Telangana: మిస్‌ వరల్డ్‌ అందగత్తెల భద్రత కోసం ఆపరేషన్ మంకీస్..అక్కడున్న కోతుల తరలింపు!


మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రమంతా ముస్తాబవుతుంది.. వివిధ దేశాల నుండి తెలంగాణకు వచ్చే సుందరీమణులు రాష్ట్రంలోని ప్రసిద్ధ ప్రదేశాల సందర్శనకు ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ అయింది.. అందులో భాగంగానే 14వ తేదీన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పర్యటన ప్రదేశాల సందర్శనకు ప్లాన్ చేశారు.. వీటిలో యునెస్కో గుర్తింపుపొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, హనుమకొండ లోని వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, ఫోర్ట్ వరంగల్ సందర్శనకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

అయితే రామప్ప దేవాలయం వద్ద కోతుల బెడద విపరీతంగా ఉటుంది.. ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే ఉన్న వానర సేనలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. ఆయనాకి వచ్చిన భక్తుల చేతిలో తినుబండారాలు లాక్కొని వారిపై పడి గాయపరిచిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే మిస్‌ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన విశ్వసుందరీమణుల ఇక్కడికి రానుడడంతో.. వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తగు రక్షణ చర్యలు  చేపడుతుంది.

ముఖ్యంగా కోతుల బెడద నుండి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందేలో భాగంగానే ఆపరేషన్ మంకీస్ పేరుతో రామప్ప పరిసరాల్లో సంచరిస్తున్న కోతులను వలవేసి పట్టుకొని వాటిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలింస్తున్నారు. ఇప్పటికే 200లకు పైగా కోతులను పట్టుకొని బోన్ లలో తీసుకెళ్లి ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో వదిలేశారు.

మరోవైపు తెలంగాణలోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించేందుకు వస్తున్న సుందరిమణులకు పర్యటన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఇష్టమైన వంటకాలతో ప్రత్యేక  మెనూను సిద్ధం చేస్తున్నారు. వారిపై చిన్న గీత కూడా పడకుండా కొనసాగుతున్న ఆపరేషన్ మంకీస్‌ను.. రామప్ప ఆలయాని వచ్చిన  ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. వీటిని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లి దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *