మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా మంటగలిసిపోతోంది. మన, పరాయి అనే భేదం లేకుండా చంపుకునే వరకు వెళ్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏకంగా 25 సంవత్సరాల కొడుకును.. ప్రియుడితో కలిసి హత్య చేసిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసును వదిలిపెట్టకుండా సీరియస్‌గా తీసుకుని పది నెలల తర్వాత తల్లితో పాటు ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఆబోతుపల్లి హల్దీవాగులో గతేడాది నవంబర్ 28న సుమారు 25 సంవత్సరాల వయసు గల యువకుడి మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మహమ్మద్ పాషా(25)గా గుర్తించారు. మృతుడి తల్లి మహమ్మద్ రహేనకు భర్త చనిపోయాడు. ముప్పురెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. దీంతో తమకు కుమారుడు అడ్డు వస్తున్నాడని ఎలాగైనా తప్పించాలని.. ఇద్దరు పథకం ప్రకారం ద్విచక్ర వాహనంపై పాషాను తీసుకెళ్లారు. వాగు శివారులో అతిగా మద్యం తాగించిన అనంతరం ఉరివేసి చంపేశారు. ఆపై వాగులో పడేసి వెళ్లినట్లు నిందితులు అంగీకరించారని డిఎస్పి నరేందర్ గౌడ్ తెలిపారు. తల్లి మహమ్మద్ రహీన, ఆమె ప్రియుడు బిక్షపతిని శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు తెలిపారు.

ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి