Telangana: కొత్త సంవత్సరంలో రేవంత్ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అప్పటినుంచే..

Telangana: కొత్త సంవత్సరంలో రేవంత్ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అప్పటినుంచే..


ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ ఇళ్ల నిర్మాణాల‌ను ప‌ర్యవేక్షించేందుకు 33 జిల్లాల‌కు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ స్థాయి క‌లిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించింది. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పదేండ్లలో హౌసింగ్ సెక్టార్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

అయితే.. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేశామని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్‌సైట్‌, టోల్‌ ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకొస్తామని పొంగులేటి వెల్లడించారు..

ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జ‌న‌వ‌రి మొద‌టి వారానికి పూర్తవుతుందని.. ల‌బ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేసేందుకు రెడీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి.. ఇళ్లకు నిధుల కేటాయించేలా రేవంత్ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *