రోడ్డు పక్కన ఉన్న స్టాళ్లలో లభించే బజ్జీలు, స్నాక్స్ చాలా రుచికరంగా ఉంటాయి. అందువల్ల వీటిని తరచుగా తినే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో వస్తాయి. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు, వంట పద్ధతులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి బజ్జీ, బోండా వంటి ఇతర వీధి ఆహార విక్రేతలు తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల కలిగే సమస్యలు ఏమిటో? వాటిని శరీరానికి ఎందుకు మంచిది కాదో ఇక్కడ తెలుసుకుందాం..
రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు శుభ్రత పాటించడంలో ఎప్పుడూ విఫలం అవుతుంటాయి. వాళ్ళు వాడే నీళ్లు, వంట పాత్రలు ఎలా ఉంటాయో వాళ్ళకే తెలియదు. వారి చేతులు శుభ్రంగా ఉంటాయను కోవడం ఒట్టి ముర్ఖత్వమే. అందుకే వీరు తాయరు చేసే బ్యాక్టీరియా, వైరస్లు ఆహారంతో కలిసిపోతాయి. ఇలాంటి కలుషిత ఆహారాన్ని తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి.
కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ ఎ, సాల్మొనెల్లా వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కూడా సంభవిస్తుంటాయి. ఆహారాన్ని వేయించడానికి ఉపయోగించే నూనె నాణ్యత కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే నూనెను పదే పదే వేడి చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. అదనంగా, తక్కువ నాణ్యత గల లేదా కల్తీ నూనెను ఉపయోగించడం వల్ల జీర్ణ సమస్యలు, కాలేయ ఒత్తిడికి కారణమవుతుంది.
బయటి ఆహారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల మూడు ప్రధాన ఆరోగ్య ప్రమాదాలు సంభవిస్తాయి. ఒకటి బరువు పెరగడానికి దారితీస్తుంది. ఊబకాయం వంటి సమస్యలకు కూడా దారితీస్తాయి. ఈ ఆహారాలలో లభించే అధిక కొవ్వు, ఉప్పు శాతం రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఇటువంటి ఆహారాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
నూనె,సుగంధ ద్రవ్యాలు వాడటం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. అదనంగా, కొన్ని దుకాణాలలో శుద్ధి చేసిన పిండి, కల్తీ పదార్థాల వాడకం విచ్చలవిడిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. రోడ్డు పక్కన దుకాణాల్లో ఉపయోగించే పదార్థాలు తాజాగా, మంచి నాణ్యతతో ఉండవు. కొన్ని సందర్భాల్లో కల్తీ రంగులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇవి చర్మంపై దద్దుర్లు, శ్వాస సమస్యలను కూడా కలిగిస్తాయి. కాబట్టి బయటి ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.