నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఈ రోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 51 లక్షల 62 వేల 522 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 164 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం, అలానే వెండి 5 కేజీల 840 గ్రాములు లభించింది. మల్లన్నకు నగదు బంగారుతో పాటు 598 యుఎస్ఏ డాలర్లు, న్యూజిలాండ్ డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 100, ఈరోస్ 100, ఓమన్ బైసా 300,ఇంగ్లాండు ఫౌండ్స్ 10, కెనడా డాలర్లు 20, సౌదీ అరేబియా రియాల్స్ 115, 30, కత్తార్ రియాల్స్ 102, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. హుండీల లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు శ్రీనివాసరావు, అధికారులు పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..