పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శ్రీలీల.. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఒక్క ఏడాదిలోనే ఏకంగా అరడజనుకుపైగా సినిమాలతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆ తర్వాత ఆమె నటించిన స్కంద, ఆదికేశ, ఎక్ర్‌ట్రాఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. వరుసగా ప్లాపులతో సతమతమవుతున్న టైంలోనే పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ అంటూ స్పెషల్ పాటతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్ జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇటు తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. రణవీర్ సింగ్. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రణవీర్ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని.. త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలకపాత్రలు నటిస్తున్నారు. రణవీర్ సినిమాతోపాటు శ్రీలీలకు హిందీలో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం శ్రీలీల చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పర్సనల్ విషయాల గురించి నిత్యం ఏదోక రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల ప్రేమలో ఉందనే టాక్ నడిచింది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ సమయంలో అమ్మ ఎప్పుడూ తనతో ఉంటుందని.. ఇంకా ప్రేమలో పడే అవకాశం ఎక్కడుంటుందని చెప్పింది.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Telugu Cinema: టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‌గా.. ఎవరంటే..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..