Spinach Benefits: ప్రతి రోజూ పాలకూర తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Spinach Benefits: ప్రతి రోజూ పాలకూర తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..


ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి..ఇది అందరికీ తెలిసిందే. అలాంటి ఆకు కూరల్లో అతి ముఖ్యమైనది పాలకూర. శరీరానికి అవసరమైన కేలరీలు పాలకూరలో పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి పాలకూర ఎంత గానో ఉపయోగపడుతుంది. పాలకూరలో ప్రోటీన్స్, పిండి పదార్థాలు, ఫైబర్ కలిగి ఉంటుంది. పాలకూరలో ఆమ్లం, విటమిన్ ఏ, విటమిన్ బి6 వంటివి కూడా ఉంటాయి. అలానే ఇతర పోషకాలు కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. పాలకూరను తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు పని తీరులో కూడా వేగం పెరుగుతుంది. పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పాలకూరలో విటమిన్‌ కె, ఎ, ఫోలేట్‌, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి.. విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచి జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఫోలేట్ గర్భవతులకు, శిశువుల అభివృద్ధికి అవసరం. రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. పాలకూరలో ఫోలేట్ సమృద్దిగా ఉంటుంది. దీని వలన కణాల పెరుగుదల మెరుగవుతుంది,DNA సంశ్లేషణకు అవసరమైన B విటమిన్ ఇందులో సమృద్దిగా ఉంటుంది. తక్కువ కేలరీలు, అధిక పోషక విలువలు కలిగి ఉండటంతో పాలకూర ఆరోగ్య ప్రయోజనాలకు నిలయంగా పిలుస్తారు.

పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచి, పిల్లలు తరచుగా అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. పాలకూరలోని ఆక్సీకరణ నిరోధకాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. పాలకూరలోని ల్యూటిన్. జియాక్సంతిన్ వలన మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం వంటి కంటిం సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పాలకూరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. పాలకూరలోని పోషకాలు రక్తపోటును నియంత్రించి గుండెకు మేలు చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *