ఈ మధ్య ఇళ్లలోకి పాములు వస్తున్న సంఘటనలు పెరిగాయి. వర్షాకాలంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇల్లు నేలమీద గానీ, మొదటి అంతస్తులో గానీ ఉంటే జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. కిటికీలు, తలుపులు, టాయిలెట్ పైపులు, కిచెన్ డ్రైన్‌ల ద్వారా కూడా పాములు లోపలికి రావచ్చు. అలాంటి సమయంలో ఈ చిట్కాలు మీకు సహాయపడతాయి.
వేప నూనె స్ప్రేకి కావాల్సినవి
- వేప నూనె – 100 మి.లీ.
- సెలరీ ఆకులు – 2 పిడికిళ్లు
- వెల్లుల్లి – 8 నుండి 10 రెబ్బలు
- బకర్ ఆకులు – 1 పిడికిలి
- ఫినైల్ – 2 టేబుల్ స్పూన్లు
- నీరు – 1 లీటరు
తయారీ విధానం
ఒక పాత్రలో నీళ్లు పోసి, వెల్లుల్లి, సెలరీ, బకర్ ఆకులు వేసి 10 నుంచి 15 నిమిషాలు చిన్న మంట మీద మరిగించాలి. చల్లారాక వడకట్టి అందులో వేప నూనె, ఫినైల్ కలపాలి. దీన్ని స్ప్రే బాటిల్ లో నింపి, వర్షాకాలంలో ఉదయం, సాయంత్రం ఇంటి తలుపులు, కిటికీలు, తోట దగ్గర స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల వేప, వెల్లుల్లి గట్టి వాసన, ఫినైల్ వాసనకి పాములు ఇంటి దగ్గరకు రావు.
పుదీనా, నిమ్మరసం స్ప్రేకి కావాల్సినవి
- నీరు – 1 లీటరు
- వెల్లుల్లి – 10 నుంచి 12 రెబ్బలు
- సెలరీ ఆకులు – 2 పిడికిళ్లు
- పుదీనా ఆకులు – 1 పిడికిలి
- నిమ్మరసం – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
- బకర్ ఆకులు – 1 పిడికిలి
తయారీ విధానం
ఒక పాత్రలో నీరు పోసి, పుదీనా, వెల్లుల్లి, సెలరీ, బకర్ ఆకులను వేసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టి చల్లారాక అందులో నిమ్మరసం కలపాలి. స్ప్రే బాటిల్‌లో నింపి వారానికి 2 నుంచి 3 సార్లు తోట, కిటికీలు, గోడల పగుళ్ల దగ్గర స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల.. పుదీనా, నిమ్మరసం వాసన పాములను ఇబ్బంది పెడుతుంది. వెల్లుల్లి వాసనను అవి తట్టుకోలేవు.
పాములను తరిమే పొడి మిశ్రమానికి కావాల్సినవి
- ఎండిన పుదీనా పొడి – 50 గ్రాములు
- ఎండిన వేప పొడి – 100 గ్రాములు
- వెల్లుల్లి పొడి – 50 గ్రాములు
- ఆవాల పొడి – 50 గ్రాములు
- ఉప్పు – 200 గ్రాములు
- మిరప పొడి – 20 గ్రాములు
తయారీ విధానం
ఈ పదార్థాలన్నింటినీ కలిపి గాలి పోని డబ్బాలో పెట్టుకోవాలి. వర్షాకాలంలో ఇంటి గోడల చిల్లులు, కిటికీలు, తలుపుల దగ్గర, తోటల్లో చల్లాలి. ఇలా చేయడం వల్ల.. పుదీనా, వేప వాసన పాములను దూరం చేస్తుంది. వెల్లుల్లి, ఆవాల పొడి వాటి వాసనను గుర్తించే శక్తిని తగ్గిస్తుంది. ఉప్పు తేమను లాక్కోవడం వల్ల ఈ మిశ్రమం ఎక్కువ రోజులు పని చేస్తుంది.
ఈ చిట్కాలు కేవలం సంప్రదాయ పద్ధతులు, ఇంటి చిట్కాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. ఒకవేళ పాములను చూసినట్లయితే వాటిని పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకుండా.. వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వండి.