Smartphone: కర్వ్‌డ్ డిస్‌ప్లేతో నయా స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్..!

Smartphone: కర్వ్‌డ్ డిస్‌ప్లేతో నయా స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్..!


భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా యువతే టార్గెట్‌గా ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు నయా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా టెక్నో పోవా కర్వ్ 5జీ పేరుతో ఓ కొత్త ఫోన్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తుంది. 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన ఈ ఫోన్ రూ. 15,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంది. అలాగే ఈ ఫోన ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగు ఎంపికలలో వస్తుంది. గీక్ బ్లాక్, మ్యాజిక్ సిల్వర్, నియాన్ సియాన్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ జూన్ 5 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. 

టెక్నో పోవా కర్వ్ 5 జీ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 1,300 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వచ్చే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ + 128 జీబీ వచ్చే ఫోన్ 16 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 64-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

టెక్నో పోవా కర్వ్ 5జీ ఫోన్ బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, వైఫై-6 లకు మద్దతు ఇస్తుంది. ఇది డాల్బీ అట్మాస్ మద్దతుతో స్టీరియో స్పీకర్లతో వచ్చే ఈ ఫోన్ ఐపీ64 రేటెడ్ మన్నికతో వస్తుంది. టెక్నోకు సంబంధించిన ఇన్-హౌస్ వాయిస్ అసిస్టెంట్, ఎల్లాతో కలిపి ఫోన్ ఏఐ వాయిస్‌ప్రింట్ సప్రెషన్, ఏఐ ఆటో కాల్ ఆన్సరింగ్, ఏఐ కాల్ అసిస్టెంట్ వంటి వివిధ ఏఐ ఆధారిత లక్షణాలను అందిస్తుంది. ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ సిస్టమ్ కారణంగా తక్కువ లేదా సిగ్నల్స్ లేని ప్రాంతాలలో కూడా సజావుగా కనెక్టివిటీని అందిస్తుంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ టెక్నో తన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *