iQOO 13: ఐక్యూ13ని డిసెంబర్ 3వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్ కెపాసిటీగల బ్యాటరీని అందించనున్నారు. 6.82 ఇంచెస్‌తో కూడిన 2కే+ రిజల్యూషన్ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు.
OnePlus 13: వన్‌ప్లస్ 13 ఫోన్‌ను ఈ నెలఖారులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్లో 6.82 ఇంచెస్‌తోకూడి 2కే+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో 100 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Poco F7: ఈ నెలలో భారత మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న మరో కొత్త ఫోన్ పోకో ఎఫ్7. ఈ ఫోన్‌ను రెడ్మీ కే80 ప్రోకి రీబ్రాండ్ వెర్షన్‌గా తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
Tecno ఫాంటమ్ V ఫోల్డ్ 2, ఫాంటమ్ V ఫ్లిప్ 2: టెక్నో నుంచి రెండు వినూత్న ఫోన్లను ఈ నెలలో భారత మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఫీచర్ల విషయానికొస్తే.. ఫాంటమ్ V ఫ్లిప్ 2లో 6.9-అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను ఇవ్వనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్, 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే.. ఫాంటమ్ V ఫోల్డ్ 2 7.85 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.
Vivo X200 సిరీస్: ఈ నెలలో భారత్‌లోకి వస్తున్న మరో కొత్త ఫోన్ వివో ఎక్స్200. డిసెంబర్ చివరల్లో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్లో మీడియాటెఖ్ 9400 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకురానున్నారు. ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.