టీవీలో వచ్చే ప్రకటనలు చూసి వెంటనే వివిధ క్రీములు, సీరమ్‌లు, ఫేస్ ప్యాక్‌లను కొనుగోలు చేయడం మనలో చాలా మందికి అలవాటే. వీటిల్లో కొన్ని ముడతలను తగ్గించడానికి, మరికొన్ని చర్మ కాంతిని పెంచడానికి.. ఇలా రకరకాల ప్రొడక్ట్స్ మనం వినియోగిస్తుంటాం. కానీ వీటిని కొనుగోలు చేసేటప్పుడు రాత్రిపూట ఏవి అప్లై చేస్తే మంచిదో, పగటిపూట ఏవి అప్లై చేస్తే బాగుంటుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు కూడా ప్రొడక్ట్ ప్యాకెట్‌పై రాసి ఉంటుంది. అయితే పగటిపూట ఉపయోగించడానికి సిఫారసు చేయని సౌందర్య సాధనాలు కూడా ఉన్నాయి. వీటిని పగలు వినియోగిస్తే.. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది.
విటమిన్ సి సీరం
పగటిపూట విటమిన్ సి సీరమ్ అప్లై చేయడం మంచిది కాదని బ్యూటీ నిపుణులు అంటున్నారు. సీరం అప్లై చేసిన తర్వాత ఎండలో బయటకు వెళ్లడం వల్ల చర్మంపై కాలిన గాయాలు వంటి మచ్చలు ఏర్పడవచ్చు. ఫలితంగా, చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు విటమిన్ సి సీరం లేదా ఏదైనా ఇతర సీరం అప్లై చేయడం మంచిది. ఇది రాత్రంతా చర్మానికి పోషణను అందిస్తుంది.
కలబంద జెల్
అలోవెరా జెల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి అలోవెరా జెల్ బలేగా పనిచేస్తుంది. అయితే కలబంద జెల్‌ను పగటిపూట అప్లై చేస్తే.. మంచి కంటే కీడే ఎక్కువగా ఉంటుంది. చర్మం మంటగా మారి ముడతలు ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీనిని రాత్రిళ్లు అప్లై చేయడం మంచిది.
ఇవి కూడా చదవండి
ఆలివ్ నూనె
ఆలివ్ ఆయిల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కానీ ఈ నూనె ఎండలో హానికరంగా మారుతుంది. రోజులో పగటి పూట ఆలివ్ నూనె రాయడం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల చర్మం పాలిపోయి ముడతలు పడవచ్చు. అందువల్ల ఆలివ్ నూనె రాత్రిళ్లు అప్లై చేయడమే బెటర్.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.