Sikandar: సల్మాన్ ‘సికందర్’ టీజర్ లోని ఈ సీన్‌ను ప్రభాస్ ‘సలార్’ నుంచి కాపీ కొట్టారా? వీడియో వైరల్

Sikandar: సల్మాన్ ‘సికందర్’ టీజర్ లోని ఈ సీన్‌ను ప్రభాస్ ‘సలార్’ నుంచి కాపీ కొట్టారా? వీడియో వైరల్


సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా సికందర్. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే అంతకన్నా ముందే తన అభిమానులకు సికందర్ సినిమా టీజర్‌ను బహుమతిగా ఇచ్చాడు సల్మాన్. టీజర్ విడుదలైన వెంటనే, ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ‘సికందర్’ తో పాటు, సల్మాన్ ఖాన్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. భాయిజాన్ టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్ బాగా ఉన్నాయి. డైలాగ్స్ కూడా పేలాయి. దీంతో సల్లూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఒక యూజర్ సల్మాన్ యాక్షన్ సన్నివేశాన్ని పోస్ట్ చేసి, “ఓ భాయ్ సాహబ్, ఇది నిజంగా వైల్డ్ ఫైర్. ట్రైలర్ కోసం వేచి ఉండలేకపోతున్నాను.’ అంటూ రాసుకొచ్చాడు. ‘సల్మాన్ ఖాన్ అభిమానిగా, నేను ఏఆర్ మురుగదాస్ సినిమాతో సంతోషంగా ఉన్నాను. అద్భుతమైన సినిమాటోగ్రఫీ. రష్మిక మందన్న చాలా అందంగా ఉంది’ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

అదే సమయంలో ఒక యూజర్ సికిందర్ టీజర్ లోని ఒక సన్నివేశాన్ని ప్రభాస్ ‘సలార్’ కాపీ అని పోస్ట్ చేశాడు. సల్మాన్ చేతిలో ఆయుధాలతో శత్రువులను వెంబడిస్తున్న సన్నివేశం ఉంది. ఈ దృశ్యం సలార్ నుంచి కాపీ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. 2023లో విడుదలైన ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ ఏ సినిమాలోనూ కనిపించలేదు, కానీ ఇప్పుడు ‘సికందర్’తో రికార్డులు బద్దలు కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ చిత్రంలో దక్షిణాది నటుడు సత్యరాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ప్రధాన విలన్‌గా కట్టప్ప కనిపించనున్నాడని సమాచారం.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్ సికందర్ టీజర్ ..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *