Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్


Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

బాలీవుడ్ ప్రముఖ నటి అనన్య పాండే పేరు గత కొన్ని రోజులుగా బాగా వార్తల్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీకి ఇటీవల పెద్దగా విజయాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. కాగా గత కొన్ని నెలలుగా అనన్య పాండే  తన సినిమాల కారణంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. అనన్య పాండే కొన్నేళ్ల పాటు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. విదేశాల్లో వీరిద్దరూ కలిసి తిరిగిన రొమాంటిక్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా వీరి బ్రేకప్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాగా ఆదిత్య రాయ్ కపూర్ విడిపోయిన తర్వాత అనన్య హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. అనన్య పాండే, హార్దిక్ పాండ్యా డ్యాన్స్ చేస్తున్న కొన్ని ప్రత్యేక ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనంత్ అంబానీ పెళ్లిలో వీరద్దరూ తెగ సందడి చేశారు. అయితే ఇప్పుడు అనన్య పాండే ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ లో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతనెవరో కాదు టీమిండియా ప్రిన్స్ శుభమన్ గిల్..

అనన్య పాండే, శుభ్‌మన్ గిల్ కలిసి కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన చేసారు. దీంతో అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని నెట్టింట ప్రచారం జరగుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అనన్య పాండే ఆసక్తికర విషయాన్ని బయట పెట్టంది. ‘విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక యాడ్ షూట్ సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. విరాట్, అనుష్క లాంటి బంధం మీకూ శుభ్‌మన్‌కూ ఉందా?’ అన్న ప్రశ్నకు స్పందించిన అనన్య.. ‘బేసిక్ గా మేం చాలా డిఫరెంట్. నాకు, శుభ్‌మన్‌కు ఎప్పటికీ సంబంధం లేదు. యాడ్ ప్రమోషన్ కోసమే కలిశాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి మాటలు కూడా లేవు.

గిల్ తో అనన్యా పాండే..

 

View this post on Instagram

 

A post shared by Beats by Dre (@beatsbydre)

మరోవైపు శుభ్ మన్ గిల్ డేటింగ్ విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్యన సారా టెండూల్కర్, ఆ తర్వాత సారా అలీఖాన్, ఇప్పుడు అనన్యా పాండేలతో అతను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల ఒక టీవీ నటితో ఈ క్రికెటర్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

 

 

ఏటీఎం సెంటర్ లో వింత శబ్ధాలు.. గుండె గుభేల్ .. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *