శ్రుతి హాసన్ సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కొన్నాళ్లుగా ఒక్క సినిమా అనౌన్స్ చేయకుండా సైలెంట్ గా ఉంటుంది. కానీ నిత్యం నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్ స్టాలో 24 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయిం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్ కు తెలియజేస్తూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది ఈ అమ్మడు. అందుకు గల రీజన్స్ తెలియాల్సి ఉంది.
కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్సబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణం తెలియరాలేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈ అమ్మడు ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. తన అకౌంట్ ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు.
ఈ క్రమంలోనే అనుహ్యంగా సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతి హాసన్ చివరగా సలార్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.
ఈ సినిమా తప్ప శ్రుతి హాసన్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. నిజానికి ఆమె తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించాల్సి ఉంది. కొన్నాళ్లపాటు షూటింగ్ లో పాల్గొన్న ఆమె.. అనుహ్యంగా ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు కూలీ సినిమాతోపాటు సలార్ 2 చిత్రంలోనూ కనిపించనుంది.