Shani Vakri 2025: త్వరలో తిరోగమనంలో శనీశ్వరుడు.. 138 రోజులు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..

Shani Vakri 2025: త్వరలో తిరోగమనంలో శనీశ్వరుడు.. 138 రోజులు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..


న్యాయ దేవుడు, కర్మ ఫలదాత శనీశ్వరుడు జూలై 2025 లో తిరోగమనంలోకి వెళ్ళబోతున్నాడు. శనీశ్వర తిరోగమన సమయంలో అనేక రాశులపై ప్రభావం చూపిస్తుంది. జూలై 13వ తేదీన మీనరాశిలో శనీశ్వర తిరోగమనంలోకి వెళ్ళబోతున్నాడు. శనీశ్వరుడు తిరోగమనం కొన్ని రాశులకు చెడు జరగనుండగా… మరికొన్ని రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది. శనీశ్వర తిరోగమనంలో అదృష్టం పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.

శనీశ్వరుడు జూలై నెలలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. వాస్తవానికి 2025 సంవత్సరంలో మార్చి 29న శనీశ్వరుడు తన రాశిని మార్చుకున్నాడు. శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ నెలలో మీన రాశిలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. జూలై 13న ఉదయం 09:36 గంటలకు మీన రాశిలో శనీశ్వరుడు తిరోగమన స్థితిలోకి వెళ్లనున్నాడు. ఇలా శనీశ్వరుడు 138 రోజులు తిరోగమన స్థితిలో ఉంటాడు. అంటే నవంబర్ 28న శనీశ్వరుడు మీన రాశిలో ప్రత్యక్షంగా మారుతాడు.

ఏ రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తుందంటే..

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: వృషభ రాశి వారికి, శని గ్రహం తిరోగమనం శుభ ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగవచ్చు. అది ప్రయోజనాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు తిరోగమనం మీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరి పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే, మీరు దానిని తిరిగి పొందవచ్చు. వీరు వ్యాపారంలో కొత్త వెంచర్ ప్రారంభించవచ్చు. వీరు మధురమైన మాటలతో చేపట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు.

మీన రాశి: మీన రాశి వారికి శనీశ్వర తిరోగమనం ప్రయోజనకరంగా ఉంటుంది. పాత వివాదాలు ముగుస్తాయి. సంబంధాలు మరింత మధురంగా ​​మారతాయి. ప్రజలు వీరి పనిని ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో వీరి ప్రేమ పెరుగుతుంది. సమాజంలో మీన రాశి గౌరవం పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *