School Holidyas: దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?

School Holidyas: దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?


సాధారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలా పండగ చేసుకుంటారు. అలాంటి ఇప్పుడు అన్నికూడా పండగలే రానున్నాయి. ఎక్కువ సెలవులు వచ్చేది దసరా. ఈ దసరా సెలవులు ఎన్ని రోజులు ఉండన్నాయో విద్యార్థులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యాసంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. అక్టోబర్‌ 2వ తేదీ దసరా పండగ వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ఈ సారి దసరా సెలవులు భారీగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వాలు విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి రెండు రాష్ట్రాల్లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండగా, క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులను ప్రకటించనున్నారు.

ఇది కూడా చదవండి: Jio Plan: కేవలం రూ.895 ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. జియోలో బెస్ట్‌ ప్లాన్‌..

ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఇక తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవులు అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారమే ఈ సెలవులు. మళ్లీ పండగ దగ్గర పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు సెలవులు గురించి ప్రకటించనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Hyderabad: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి.. నలుగురు సీరియస్‌

ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఎందుకంటే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఏపీలోని కొన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు అంటే ఆగస్ట్‌ 18వ తేదీన పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో పిల్లలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సెలవు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Viral Video: అయ్యో పాపం.. చిన్నారిపై వీధి కుక్కల కృరత్వం.. ఈ వీడియో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *