ఓటీటీ ఆడియెన్స్ ను బాగా అలరించిన ప్రోగ్రామ్స్ లో సర్కార్ సీజన్ ఒకటి. బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో క్విజ్ లాంటి గేమ్ కాన్సెప్ట్ సాగే ఈ షో ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేసింది. ఆహా వీడియో ఓటీటీలో వచ్చిన ఈ సెలబ్రిటీ గేమ్ షో
ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో సీజన్ కు రంగం సిద్ధమైంది. కాగా సర్కార్ తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించాడు. గత నాలుగో సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సహజంగానే ఈ ప్రోగ్రామ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ‘ఈసారి అంతకు మించి’ అనేలా ఇప్పుడు సర్కార్ ఐదో సీజన్ రాబోతోంది. ఈసారి కూడా సుడిగాలి సుధీర్ హోస్ట్ చేయనున్నాడు. గురువారం (మే 29) సర్కార్ కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ రామ్ చరణ్ పెద్ది తరహాలో తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు.
‘ఒకటే ఆట ఆడైనాకి.. ఏదోలాగా గెలిచేదానికి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ స్టేజీ మీదున్నప్పుడే చేసేయాలా.. ఆడతామా ఏంటీ మళ్లీ.. సర్కార్ సీజన్ 5.. ఇక్కడ ఆడేది గెలవనీకె కాదు.. నువ్వేందో అందరికీ తెలవనీకే’ అంటూ సుడిగాలి సుధీర్ సర్కార్ కొత్త సీజన్ గురించి చెప్పేశాడు. కాగా జూన్ 6న సాయంత్రం 7 గంటల నుంచి ఐదో సీజన్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. అలాగే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రానుంది. మరి గత సీజన్ లాగే ఈసారి కూడా సుధీర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెప్పిస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి

హరిహర వీరమల్లు ఈవెంట్‌లో నిధి అగర్వాల్ సూపర్బ్ డ్యాన్స్.. వీడియో

ప్రభాస్ స్పిరిట్ కన్నా ముందు దీపిక రిజెక్ట్ చేసిన సినిమాలివే

వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్

శ్రీ విష్ణు ‘సింగిల్’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
జూన్ 6 న ఫస్ట్ ఎపిసోడ్
Trivia? ✔️
Twists? ✔️
Sudheer’s punchlines? ✔️
Sarkaar Season 5 is serving entertainment with attitude! 🤟🏻Watch #Sarkaar5 from June 6 , 7 PM only on #aha pic.twitter.com/XKzP1Z0bUi
— ahavideoin (@ahavideoIN) May 29, 2025
ఆహా సర్కార్ సీజన్ 5 గ్లింప్స్..
ఇవి కూడా చదవండి..
OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.