ఇప్పుడంటే మన దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేశారు కానీ.. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కారణంగానే చాలామంది ట్యాలెంట్ బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యిన వారే. అలా పై ఫొటోలో సమంతతో ఉన్న ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు టిక్ టాక్ స్టార్. తన లిప్ సింకింగ్ వీడియోలు, రీల్స్ కు నెట్టింట మంచి ఆదరణ ఉండేది. ఈ క్రేజ్ తోనే సినిమాలు, సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ఈ క్యూటీ 11 ఏళ్లకే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. అక్కినేని నాగార్జున,రాజ్ తరుణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఛైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 50 కు పైగా సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి ఒక సినిమాలో తన నటనకు గానూ బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకుంది. అన్నట్లు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేసింది. కాగా ఛైల్డ్ ఆర్టిస్టుగా జెట్ స్పీడ్ లో దూసుకుపోయిన ఈ క్యూటీ హీరోయిన్ గా మాత్రం రేసులో చాలా వెనకపడింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సొగసరి కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి స్పందన వస్తుంటుంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తన పేరు ప్రణవి మానుకొండ.
ఇవి కూడా చదవండి
టిక్ టాక్ వీడియోలతో చిన్నతనంలోనే నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది ప్రణవి. కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. రొటీన్ లవ్‌స్టోరీ, ఉయ్యాలా జంపాలా. నాగార్జున సోగ్గాడే చిన్నినాయన తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. అలాగే ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి తదితర సూపర్ హిట్ సీరియల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది.
ప్రణవి లేటెస్ట్ ఫొటోస్..
కాగా 2023లో స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమాతో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంది ప్రణవి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన తర్వాతి సినిమా గురించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.