సెలబ్రిటీలు తరచుగా తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ముఖ్యంగా పుట్టిన రోజు లేదా ఇతర సందర్భాల్లో తమ త్రో బ్యాక్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి ఫోటోనే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సల్మాన్ టీనేజ్ లో ఉన్నప్పుడు దిగిన ఫొటో. ఇక అతని పక్కన ఉన్న చిన్న పిల్లవాడు ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో. అంతేకాదు సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసిన ఓ స్టార్ హీరోయిన్ భర్త కూడా. అతనెవరో గుర్తు పట్టడం కొంచెం కష్టమే. పైగా ఈ హీరో గురించి తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేదు. ఈ ఫొటోలో సల్మాన్ ఖాన్ పక్కన ఉన్నది బాలీవుడ్ ప్రముఖ నటుడు జహీర్ ఇక్బాల్. అదేనండి దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా భర్త , బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా అల్లుడు. సల్మాన్ ఖాన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కి నెటిజన్ల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. అంతే కాదు, సల్మాన్ ఖాన్ చిన్నప్పుడు జహీర్ తో ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు కూడా సల్మాన్, జహీర్ మధ్య సంబంధం అంతే ప్రత్యేకమైనది.
జహీర్ ఇక్బాల్ 2019లో రొమాంటిక్ డ్రామా నోట్‌బుక్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత 2022లో డబుల్ XL సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. 2017 నుంచే వీరికి పరిచయం ఉంది. ఆపై అది ప్రేమగా మారింది. ఈ ప్రేమ పక్షులు 2022 లో డబుల్ XL చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. సోనాక్షి, జహీరోఆమెను జూన్ 23, 2024 న పెళ్లిపీటలెక్కారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి