Salman Khan: ఆ స్టార్ హీరోయిన్ బాత్రూమ్‌లో నా పోస్టర్ ఉండేది.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్

Salman Khan: ఆ స్టార్ హీరోయిన్ బాత్రూమ్‌లో నా పోస్టర్ ఉండేది.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ డేస్ లో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు వందకోట్ల మార్క్ ను దాటేశాయి. కాగా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఇటీవలే మురగదాస్ తో కలిసి సికిందర్ అనే సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు సల్మాన్ తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. 50 వయసు దాటినా కూడా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉన్నాడు. అంతే కాదు ఈమధ్య సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని ఓ గ్యాంగ్ బెదిరిస్తున్న విషయం తెలిసిందే..

ఇది కూడా చదవండి : ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్‌లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..

ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ కపిల్ శర్మ షోకు గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ షోలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ షోలో సల్మాన్ ఖాన్ ఫోటోలను ఫ్లక్సీల్లో, రోడ్డుపక్కన, సెలూన్ షాప్స్ లో ఎలా వాడుకుంటారో ఫోటోలు వేసి చూపించారు. ఈ ఫోటోలకు స్లామం పడిపడి నవ్వుకున్నాడు. అలాగే ఆయన మాట్లాడుతూ హీరోయిన్ కరీనా కపూర్ బాత్రూమ్‌లో కూడా నా పోస్టర్‌ ఉందని విన్నాను. నేను ఒకసారి వల్ల ఇంటికి కూడా వెళ్లి చూశా.. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్ళు ఉంటాయి. ఆతర్వాత ఆమెకు 15 ఏళ్ళు వచ్చాకా నా పోస్టర్ తీసేసి రాహుల్‌ రాయ్‌ పోస్టర్‌ పెట్టుకుంది అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..

ఇదిలా ఉంటే ఇటీవలే కరీనా సల్మాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతను ఓ చెడ్డ నటుడు అని కామెంట్స్ చేసింది. నేను సల్మాన్ అభిమానిని కాదు. నాకు అతనంటే నాకు ఇష్టం లేదు, అతను చాలా చెడ్డ నటుడు. అతను ఎప్పుడూ పక్కవారిని చాలా చులకనగా చూస్తుంటాడు” అని తెలిపింది. ఇక ఇప్పుడు సల్మాన్ కరీనా తన అభిమాని అని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి బాడీగార్డ్‌, క్యూంకీ, బజ్‌రంగీ భాయ్‌జాన్‌ సినిమాల్లో నటించారు.

ఇది కూడా చదవండి: ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *