రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు కీలక ముందడుగు పడింది. వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ దేశాలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో పాటు యూరప్ దేశాలతో సమావేశం అద్భుతంగా జరిగిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక భేటీగా అభివర్ణించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించేందుకు ఇరు దేశాలతో కలిసి పనిచేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్స్కీ సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోన్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో ట్రంప్ పోస్టు చేశారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో యావత్ ప్రపంచం అలిసిపోయిందని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ త్వరలోనే శాంతిని చూడబోతోందని తెలిపాడు. కాల్పుల విరమణ కాదు.. శాంతి కావాలని ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసమే తాము కృషిచేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నాడు. యుద్ధం ముగించేందుకు సహకరిస్తున్న అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు. యుద్ధానికి దౌత్యపరమైన ముగింపు పలకాలని ఆయన కోరారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో చాలామంది మరణించారని.. శాంతి కోసం అందరితో కలిసి పనిచేస్తున్నామని ట్రంప్ తెలిపాడు.
వీడియో చూడండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.