కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ వన్ చిత్రంలో ఈ అమ్మడు కథానాయికగా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రుక్మిణి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో మరింత అందంగా కనిపిస్తుంది.
అలాగే కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సరసన మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మదరాసీ చిత్రంలోనూ ఈ అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.
ఇవే కాకుండా అటు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలోనూ ఈ అమ్మడే హీరోయిన్. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో ఈ అమ్మడు ఎంపిక చేసినట్లు టాక్. యశ్ , గీతూ మోహన్ దాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో రుక్మిణిని తీసుకున్నట్లు సమాచారం.
ఇవే కాకుండా తెలుగు, తమిళంలో రుక్మిణికి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ జోరు మీద ఉంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ వరుస పోస్టులతో అలరిస్తుంది.