కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ హీరో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించడం లేదు. విభిన్నమై కథలను ఎంచుకుంటున్నప్పటికీ సూర్య చిత్రాలు కమర్షియల్ హిట్స్ కాలేకపోతున్నాయి. ఇటీవల సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెట్రో. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇందులో సూర్య సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో వీరిద్దరూ ఢీ గ్లామర్ లుక్ లో కనిపించడం విశేషం.
మే 1న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు, సూర్య, పూజా హెగ్డే మాత్రం మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో మే 30 అర్దరాత్రి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక రెట్రో మూవీ కథ విషయానికి వస్తే… పారి కన్నన్ (సూర్య), రుక్మిణి (పూజా హెగ్డే), గ్యాంగ్ స్టర్ తిలక్ (బోజు జార్జ్) పాత్రల చుట్టూ తిరుగుతుంది. గ్యాంగ్ స్టర్ అయిన పెంచిన తండ్రి దగ్గర పెరిగిన పారి రౌడీగా మారతాడు. రుక్మిణి ప్రేమ కోసం రౌడీయిజం మానేస్తానని .. పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తారు. కానీ పెళ్లిరోజే పారి కత్తిపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది సినిమా.
Idhu Paari yude dharmam, oru thudakkam maathram 🔥😎Watch Retro, out 30 May, on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam. #RetroOnNetflix pic.twitter.com/LrjaXHL6JG
— Netflix India South (@Netflix_INSouth) May 29, 2025
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్..
Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..