Red Ant Chutney: గిరిజనుల స్పెషల్ ఎర్ర చీమల చట్నీ.. ఒకసారి ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..

Red Ant Chutney: గిరిజనుల స్పెషల్ ఎర్ర చీమల చట్నీ.. ఒకసారి ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..


గిరిజన వంటకాలు కేవలం వంటకాలు మాత్రమే కాదు. అవి నేటి మనిషి మనుగడకు మార్గాలు.. ప్లాస్టిక్ ఉండదు, ప్రిజర్వేటివ్‌లు ఉండవు, వ్యర్థాలుఉండవు. వండడానికి కుండలు, లేదా వెదురు వంటి ప్రకృతి సహజ సిద్దమైన పాత్రలనే ఉపయోగిస్తారు. ఈ వంట చేసే పద్ధతులు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైనవి. అటువంటి గిరిజన వంటల్లో ఒకటి ఎర్ర చీమల చట్నీ దీనిని గిరిజనలు చప్రా అని అంటారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బోండా,యు దిడాయి వంటి తెగలు తయరు చేసే ప్రత్యేకమైన వంటకం ఎర్ర చీమల చట్నీ. ఇది ఆరోగ్యానికి మంచిదని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. ఈ ఎర్ర చీమల చట్నీ ప్రోటీన్, ఖనిజాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. GI ట్యాగ్ కూడా లభించిన ఈ ఎర్ర చీమల చట్నీ తయారీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

  1. ఎర్ర చీమలు
  2. ఎర్ర చీమల గుడ్లు
  3. ఎండు మిరపకాయలు
  4. అల్లం
  5. వెల్లుల్లి
  6. చింతపండు
  7. ఉప్పు –
  8. కొబ్బరి
  9. పుదీనా

తయారీ విధానం: ఎర్ర చీమలను, వాటి గుడ్లను సేకరించి శుభ్రం చేయాలి. తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి చీమలను వేసి వేయిస్తారు. తర్వాత రోటిలో వేయించిన చీమలు, గుడ్లు వేసి రోకలితో మెత్తగా దంచుకోవాలి. తర్వాత మిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, చింతపండు, కొబ్బరి, పుదీనా వేసి తగినంత నీరు పోసి రుబ్బుకోవాలి. అంతే ఎర్ర చీమల చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటారు. చీమలలో ఉండే ఫార్మిక్ ఆమ్లం చట్నీకి మంచి రుచి ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *