Ravi Mohan: ‘అల్లుడిలా కాకుండా కొడుకులా చూశా.. 100 కోట్ల అప్పులు చేశా’.. స్టార్ హీరోపై అత్త సంచలన ఆరోపణలు

Ravi Mohan: ‘అల్లుడిలా కాకుండా కొడుకులా చూశా.. 100 కోట్ల అప్పులు చేశా’.. స్టార్ హీరోపై అత్త సంచలన ఆరోపణలు


తమిళ స్టార్ హీరో జయం రవి కుటుంబ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు గతేడాది హీరో ప్రకటించాడు. అయితే విడాకుల గురించి తనని ఒక్కసారైనా సంప్రదించకుండానే ఆయన ప్రకటించారని ఆర్తి ఆరోపించింది. దీంతో వీరిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. అయితే ఈ కేసు ఓ కొలిక్కి రాకుండానే జయం రవి, భార్య ఆర్తి, సింగర్ కెనీషా (రవి మోహన్ ప్రియురాలిగా ప్రచారం జరుగుతోంది) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఆర్తి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌ స్పందించింది. ఈ మేరకు రవి మోహన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రవి మోహన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తోంది. రవి మోహన్ ప్రోత్సహించడం వల్లే నేను సినిమాల్లోకి అడుగు పెట్టాను. అతనినే హీరోగా పెట్టి పలు సినిమాలు నిర్మించారు. ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి రూ.100 కోట్లు అప్పు తీసుకున్నాను. అందులో 25 శాతం తనకే రెమ్యునరేషన్ గా ఇచ్చాను. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా‌ నా వద్ద ఉన్నాయి’

ఇవి కూడా చదవండి

‘రవి మోహన్ ను నేను ఎప్పుడూ ఒక అల్లుడిలా చూడలేదు. సొంత కొడుకుగా భావించాను. అతనిక ఏ కష్టం రాకూడదని, ఎప్పుడూ బాధపడకూడదనుకున్నా. అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను. నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని. నష్టాలను పూడ్చడానికి నా బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తానని ‘సైరన్‌’ సమయంలోనే రవి మోహన్ మాటిచ్చాడు. కానీ ఏ సినిమాకు సంతకం చేయలేదు. అంతేకాకుండా, అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు. అతను నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచేవాడు. ఒక అమ్మగా ఇప్పుడు నేను కోరుకునేది ఒక్కటే.. తనని ఇంతకాలం ఒక హీరోగా చూశాను. కానీ ప్రస్తుతం సానుభూతి పొందడం కోసం ఇప్పుడు అతను చేసే ఆరోపణలు చూస్తుంటే చాలా బాధేస్తోంది’ అని తన ప్రకటనలో రాసుకొచ్చింది ఆర్తి తల్లి. ప్రస్తుతం ఈ కామెంట్స్ కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి.

రవి మోహన్ భార్య ఆర్తితో సుజాత విజయ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *