Rashmika Mandanna: పవర్ ఫుల్ పాత్రలో రష్మిక మందన్నా.. కొత్త సినిమా పోస్టర్ చూశారా..?

Rashmika Mandanna: పవర్ ఫుల్ పాత్రలో రష్మిక మందన్నా.. కొత్త సినిమా పోస్టర్ చూశారా..?


నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. గత రెండేళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో మెప్పిస్తుంది. ఇటీవలే పుష్ప 2, ఛావా, సికందర్ సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుబేర సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలలో కనిపించింది. ఇక ఎప్పటిలాగే ఈ చిత్రంలో తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది రష్మిక. మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ చిత్రాల్లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గురువారం కొత్త సినిమాను ప్రకటించింది. ఈమూవీలో తాను సరికొత్తగా కనిపించనున్నట్లు ముందుగానే తెలియజేసింది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

రష్మిక మందన్న ఇప్పుడు నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్ టైటిల్ “మైసా”. రవీంద్ర పూలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఐదు భాషలలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్ట్ లో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. “ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి.. !” అంటూ నిర్మాణ సంస్థ షేర్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తుంది. ఇందులో రష్మిక వారియర్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక తన కొత్త సినిమాపై రష్మిక రియాక్ట్ అవుతూ.. “నేనెప్పుడూ కొత్తది.. భిన్నమైనది.. ఉత్తేజకరమైన సినిమాలకు ప్రాధాన్యమిస్తాను. మైసా లాంటి సినిమా ఒకటి. నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం ఇది. ఇప్పటివరకు చేయని వెర్షన్. ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే” అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *