Ram Charan: ఉపాసన తన మొబైల్‌లో రామ్ చరణ్ నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుందో తెలుసా? పెద్ద కథే ఉందిగా..

Ram Charan: ఉపాసన తన మొబైల్‌లో రామ్ చరణ్ నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుందో తెలుసా? పెద్ద కథే ఉందిగా..


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలందిస్తుండడం విశేషం.పెద్ది’ సినిమా మార్చి 27, 2026న చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. రామ్ చరణ్ సంగతి పక్కన పెడితే.. ఉపాసన కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ గా ఉంటోంది. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న మెగా కోడలు ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు ఆమెను కో ఛైర్మన్‌ గా నియమితురాలైంది. ఇక తల్లిగా క్లింకారను కంటికి రెప్పలా చూసుకుంటోన్న ఉపాసన లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన భర్త చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

సెలబ్రిటీలు తరచుగా తమ ఫోన్ నంబర్లను మార్చుకుంటారు. అందుకు చాలా కారణాలున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా దీనికి మినహాయింపు కాదు. అతను ఇప్పటికే వందల సార్లు తన ఫోన్ నంబర్‌ను మార్చాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ 199 సార్లు తన మొబైల్‌ నెంబర్‌ని మార్చుకున్నారట. ప్రస్తుతం వాడుతున్నది 200వ నెంబర్‌ అట. అందుకే ఉపాసన తన మొబైల్ లో తన భర్త కాంటాక్ట్ నేమ్ ను ‘రామ్‌ చరణ్‌ 200’ అని సేవ్‌ చేసుకుందట.

ఇవి కూడా చదవండి

ఉపాసన ఇన్ స్టా గ్రామ్ వీడియో..

రామ్ చరణ్ 2007 లో చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. అయితే వీటిలో ఏ సినిమా మీకు బాగా నచ్చిందని ఉపాసనను అడిగితే.. ‘RRR’ అని బదులిచ్చింది ఉపాసన. రామ్ చరణ్ తన సినిమా కెరీర్‌లో ఈ మూవీ కోసమే ఎక్కువ వర్క్ చేశాడని ఉప్సీ పేర్కొంది. కాగా రామ్ చరణ్, ఉపాసన 2012 లో వివాహం చేసుకున్నారు. వీరికి 2023 జూన్ క్లింకార అనే కూతురు పుట్టింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *