సూపర్ స్టార్ రజినీకాంత్ నటింటిన లేటేస్ట్ మాస్ యాక్షన్ డ్రామా కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలకపాత్రలో నటించారు. దీంతో విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇందులో పూజా హెగ్డే చేసిన మోనికా స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 14న అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా రజినీని చూసి ఓ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్. ప్రస్తుతం అగ్రకథానాయికగా దూసుకుపోతున్న హీరోయిన్ భర్త. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఆయనే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..
ఇవి కూడా చదవండి
కూలీ సినిమా విడుదల సందర్భంగా రజినీని కలిసిన విఘ్నేశ్ శివన్ కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రజినీని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నట్లు రాసుకొచ్చారు. కూలీ విడుదల సందర్భంగా విఘ్నేష్ తాను తెరకెక్కిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫస్ట్ లుక్‌ను వాయిదా వేశారు.”నేను మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంటారు. మీరు నిజంగా ఎంతో మంచి వ్యక్తి. స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి హడివిడి లేకుండా సామాన్యులుగా ఉండడం మీకు మాత్రమే సాధ్యం. 50 సంవత్సరాల మీ సినీప్రయాణం, ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుంది” అంటూ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
నిజానికి విఘ్నేశ్ శివన్ రజినీకి వీరాభిమాని. ఆగస్ట్ 14న కూలీ సినిమా విడుదల కావడంతో రజినీని మొదటిసారి కలిసిన ఫోటోస్ షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రజినీ నటించిన కూలీ చిత్రంలో మొదటిసారి నాగార్జున విలన్ పాత్రలో నటించారు.ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..