Heavy Rain Alert: హైదరాబాద్‌లో అర్ధరాత్రి మళ్లీ భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసుల గుండెల్లో వణుకు మొదలైంది. చాలా చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. పాతబస్తీ, చార్మినార్, చాంద్రాయణగుట్టలో వర్షం కురిసింది. బహదూర్‌పురా, గౌలిగూడ, శాలిబండ, సైదాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, యూసుఫ్‌గూడలో వర్షం ముంచెత్తింది. బండ్లగూడ, నాంపల్లి, అంబర్‌పేట్‌లో వర్షం కురిసింది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురియన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: రాఖీ పండగకి భగ్గుమన్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తలం ధర ఎంతో తెలుసా?
మరోవైపు హిమాయత్‌సాగర్ నీటిమట్టం పెరగడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ఏరియాలో రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. బారికేడ్స్ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు దీన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.
నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురియన్నాయని, అలాగే రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: త్వరపడండి.. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.189 ప్లాన్..బెనిఫిట్స్ ఇవే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి