Rain Alert: ఈ జిల్లాలకు కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 2 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

Rain Alert: ఈ జిల్లాలకు కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 2 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయన్నారు. వాతావరణంలోని అనూహ్య మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు..

శుక్రవారం.. శనివారం వాతావరణం ఎలా ఉంటుందంటే..

శుక్రవారం (16-05-25) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శనివారం (17-05-25) అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిలబడరాదని సూచించారు.

గురువారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 54మిమీ, ఏలూరు జిల్లా నిడమర్రులో 54మిమీ, కాకినాడ జిల్లా కాజులూరులో 42 మిమీ, అనకాపల్లి జిల్లా పాతవలసలో 41మిమీ, కాకినాడ జిల్లా కరపలో 32.2మిమీ, పిఠాపురంలో 31.7మిమీ, అల్లూరి జిల్లా దళపతిగూడలో 31.5మిమీ వర్షపాతం నమోదైందన్నారు.

శుక్రవారం ఉష్ణోగ్రతలు ఇలా..

అలాగే శుక్రవారం ఉష్ణోగ్రతలు 41-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. విజయనగరం-5, పార్వతీపురంమన్యం-5 మండలాల్లో (10) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

గురువారం బాపట్ల జిల్లా ఇంకొల్లు 42.6°C, పల్నాడు జిల్లా వినుకొండ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 42.5°C, ఎన్టీఆర్ జిల్లా ముచ్చినపల్లిలో 41.9°C, ప్రకాశం జిల్లా వేమవరంలో 41.7°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.5°C, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *