Rahul Gandhi: రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్..! ఢిల్లీలో హైటెన్షన్‌..

Rahul Gandhi: రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్..! ఢిల్లీలో హైటెన్షన్‌..


ఇండియా కూటమి ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్‌ నెలకొంది.. ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురు ఎంపీలను అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా.. విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తున్న విపక్ష ఎంపీలను అడ్డుకున్న పోలీసులు.. వారిని ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కాగా.. లోక్ సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ.. ఓట్ల చోరీ జరిగిందని.. ఇండి కూటమి నేతలు సోమవారం ర్యాలీగా బయలుదేరారు.. విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ దృష్ట్యా.. పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

సంసద్‌ మార్గ్‌ను పోలీసులు బ్లాక్‌ చేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాగా.. తమతో భేటీకి 30మందికే అనుమతి ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

వెళితే అందరం కలిసే వెళతామంటున్న ఇండి కూటమి ఎంపీలు పట్టుబట్టారు.. అంతేకాకుండా బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి.. రోడ్డుపై బైఠాయించారు.. దీంతో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకుని.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.



2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల గోల్‌మాల్‌ జరిగిందని దీనిపై సమాధానం చెప్పాలని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.. అలాగే.. బిహార్‌లో ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణపై కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.. కొత్త ఓటర్ల కోసమే ఫామ్‌-6 ఉపయోగిస్తారనీ, కానీ తొలిసారి ఓటర్‌ కాని వృద్ధుల కోసం కూడా పదేపదే ఫామ్‌-6 వాడుతున్నారని రాహుల్‌గాంధీ EC దృష్టికి తెచ్చారు. శకున్‌ రాణి అనే మహిళ ఓటు గురించి వివరాలు రాహుల్‌ సమర్పించారు. ఇలాంటి ఎన్నో ఓట్ల బాగోతం బయటపడుతుందని తెలిసే, EC తమకు డిజిటల్‌ డేటాను ఇవ్వడం లేదన్నది రాహుల్‌ ఆరోపణ.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *