Rahu Budha Yuti 2025: త్వరలో బుధ, రాహు సంయోగం.. ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే…

Rahu Budha Yuti 2025: త్వరలో బుధ, రాహు సంయోగం.. ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే…


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక రాశిని విడిచిపెట్టి.. నిర్దిష్ట సమయం తర్వాత మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. రెండు గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు.. దానిని గ్రహ సంయోగం అంటారు. కొత్త సంవత్సరంలో బుధుడు , రాహువు ఒకే రాశిలో సంచరించడంతో సంయోగం ఏర్పడనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు వృత్తి, వ్యాపారంలో పురోగతితో పాటు అపారమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు.

బుధుడు, రాహువు కలయిక ఎప్పుడంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు దాదాపు 18 నెలల పాటు ఒకే రాశిలో ఉంటాడు. రాహువు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. అయితే బుధుడు ఫిబ్రవరి 27, 2025 ఉదయం 11:46 గంటలకు, మీన రాశిలో అడుగు పెట్టనున్నాడు. మీనరాశిలో బుధుడు సంచారం వల్ల బుధుడు, రాహువు కలయిక ఏర్పడుతుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది.

ఏ రాశుల వారికి లాభం అంటే

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి బుధుడు, రాహువు కలయిక వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ అవకాశాలున్నాయి. పాత పెట్టుబడి నుంచి కొంత ప్రయోజనం పొందుతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. అంతే కాదు ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించి.. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

తులారాశి: బుధుడు, రాహువుల సంయోగం వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. ఎవరైనా చట్టపరమైన విషయాలలో ఇబ్బంది పడుతుంటే.. ఈ సమయంలో విజయం పొందవచ్చు. వీరిలో అనేక పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారస్తులు పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు విద్యార్థులు ప్రత్యేక విజయాలు సాధించే అవకాశం ఉంది.

వృశ్చికరాశి: వృశ్చిక రాశిలోని ఐదవ ఇంట్లో బుధుడు, రాహువు కలయిక జరగనుంది. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు లాటరీ , షేర్లలో అపారమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరుల మార్గాలు తెరచుకుంటాయి. దాంపత్య సంతోషానికి ఈ కలయిక ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *