శ్రీ జగన్నాథ ఆలయం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు. ఇది భారతదేశ సాంస్కృతిక గుర్తింపు కూడా. ఈ ఆలయంతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు, రహస్యాలు విశ్వాసం ముందు తర్కం నిజంగా పనిచేయదా అని ఆలోచించేలా చేస్తాయి. ఈ ఆలయ రహస్య రహస్యాలు ఇవన్నీ తెలియజేస్తాయి. వేల సంవత్సరాలుగా ఈ ఆలయం భక్తుల విశ్వాస కేంద్రంగా ఉండటానికి ఇదే కారణం. ఈ ఆలయం రహస్యాలు శాస్త్రం, తర్కానికి అతీతమైనవి. కనుక సైన్స్ కూడా తెలుసుకోలేని జగన్నాథ ఆలయానికి సంబంధించిన మిస్టరీల గురించి కూడా తెలుసుకుందాం..
జగన్నాథ ఆలయానికి సంబంధించిన 10 రహస్యాలు
- గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్న జెండా: సాధారణంగా జెండా గాలి దిశలో ఊగుతుంది. జగన్నాథ ఆలయ జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుంది. పూజారులు ప్రతిరోజూ 45 అంతస్తుల ఎత్తైన ఆలయం పైకి.. ఆ జెండాను మారుస్తారు. ఈ సంప్రదాయం గత 800 సంవత్సరాలుగా కొనసాగుతోంది.
- ఆలయం నీడ పడదు: పగలు ఎటువంటి సమయంలో కూడా ఈ ఆలయం ప్రధాన గోపురం నీడ ఎప్పుడూ కనిపించదు. ఇది ఈ ఆలయానికి చెందిన అద్భుతం.. అదే విధంగా ఒక రహస్యం.
- సముద్రపు అలల శబ్దం ఆలయంలోపల వినిపించదు: ఈ ఆలయం బంగాళాఖాతం దగ్గర నిర్మించబడింది. అయితే ఆలయ ద్వారం లోపలికి ప్రవేశించినప్పుడు సముద్రపు అలల శబ్దం వినబడదు.
- సముద్రపు గాలి ఎప్పుడూ ఆలయం లోపలికి వీచదు: సాధారణంగా సముద్రం నుండి వీచే గాలి తీరం వైపుకు వీస్తుంది. అయితే జగన్నాథ ఆలయంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. సైన్స్ ప్రకారం పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు , రాత్రి భూమి నుంచి సముద్రం వైపు గాలి వీచాలి. అయితే పూరీలో ఈ నియమం దీనికి విరుద్ధంగా ఉంది. ఇది చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
- జగన్నాథ ఆలయంలోని వంటగది 24 గంటలు తెరిచి ఉంటుంది. ఈ ఆలయ వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజూ 56 రకాల ఆహారాన్ని తయారు చేస్తారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని 7 పాత్రలను ఒకదానిపై ఒకటి ఉంచి తయారు చేస్తారు. పైభాగంలోని పాత్రలోని ఆహారాన్ని ముందుగా వండుతారు. ఆలయంలోని ఆహారం ఎప్పుడూ తగ్గిపోదు లేదా మిగిలిపోదు. - ఆలయం పైభాగంలో అమర్చబడిన నీలచక్రం 2200 కిలోల బరువు ఉంటుంది… అంత భారీ బరువు ఉన్నప్పటికీ ఈ చక్రం ఎలా స్థిరంగా ఉంటుంది? గురుత్వాకర్షణ నియమం దానిపై ఎందుకు పనిచేయదు?
- పక్షులు లేదా విమానాలు ఎప్పుడూ ఆలయం పైన ఎగరవు. ఆలయ ప్రాంగణంలో పక్షులు ఎగరవు. ఆలయ సమీపంలో కనీసం గూళ్ళు కూడా కట్టుకోవాడు. ఇది సైన్స్ దగ్గర కూడా సమాధానం లేని రహస్యం.
- రథయాత్ర సమయంలో, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల కోసం మూడు భారీ రథాలను తయారు చేస్తారు. దీని కోసం వేలాది చెట్లను నరికివేస్తారు. అయినప్పటికీ కలప కొరత ఎప్పుడూ ఉండదు. ఈ రథాలను యంత్రాలు లేకుండా లాగుతారు. రథయాత్ర సమయంలో, రథాలు ఒకే మార్గంలో తిరుగుతాయి, వీటిని నియంత్రించడం చాలా కష్టం.
- ఆలయం పైన ఉంచబడిన సుదర్శన చక్రం ఏ దిశ నుండి చూసినా ఒకేలా కనిపిస్తుంది. ఏ దిశ నుండి చూసినా ఒకేలా కనిపిస్తుంది.
- విగ్రహాలు ప్రతి 12 సంవత్సరాలకు మారుతాయి: ప్రతి 12 సంవత్సరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల పాత విగ్రహాలను ధ్వంసం చేసి, కొత్త విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇది రాత్రి రహస్యంగా నిర్వహించే ప్రత్యేక ఆచారం. ఈ ప్రక్రియలో పాల్గొన్న పూజారులు దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. ఇది చాలా మర్మమైన ప్రక్రియ. పాత విగ్రహాలను రహస్యంగా ఖననం చేస్తారు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.