PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య.. మూడోదశలో గుర్తించిన ఇస్రో!

PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య.. మూడోదశలో గుర్తించిన ఇస్రో!


తిరుగులేని విజయాల ట్రాక్‌రికార్డు ఉన్న ఇస్రో ప్రస్థానంలో చిన్న అపశృతి ఇది. భారీ అంచనాలు పెట్టుకున్న ప్రయోగం సక్సెస్‌ కాలేదు. తన 101వ ప్రయోగం సందర్భంగా, దేశ రక్షణ కోసం సరికొత్త శాటిలైట్‌ని లాంచ్‌ చేసింది. అయితే, పీఎస్‌ఎల్‌వీ – సి 61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే సాంకేతి సమస్య తలెత్తింది. పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం పూర్తికాలేదని, మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందన్నారు.

మన సరిహద్దుల్లో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా జల్లెడ పట్టేలా ఆకాశంలో నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసింది ఇస్రో. అది రాత్రిపగలు తేడా లేకుండా హై రిజల్యూషన్‌ కెమెరాలతో మన బోర్డర్స్‌ని అబ్జర్వ్‌ చేస్తూ ఉంటుంది. భారత్‌కు ఆకాశంలో మరో కన్నులా ఉపయోగపడుతుంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ శాటిలైట్‌ ప్రయోగం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ నెల 18న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది PSLV C-61 రాకెట్‌. ఈ రాకెట్‌ ద్వారా EOS-09 అనే శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టారు. రాకెట్‌ని అసెంబ్లింగ్‌ చేసి, ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా ప్రయోగించారు. మన రక్షణ దళాలకు, ఈ ప్రయోగం చాలా ఉపయోగపడనుంది.

EOS-09 పేరుతో ప్రయోగించిన RISAT..1B భూ పరిశీలన ఉపగ్రహం అత్యంత శక్తివంతమైనదంటున్నారు సైంటిస్టులు. ఇక రాబోయే ఐదేళ్లలో దేశ రక్షణ కోసం భారీగా నిఘా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో నడుం బిగించింది. సరిహద్దులను పర్యవేక్షించేందుకు, శత్రవుల కదలికలను పసిగట్టేందుకు, ఆర్మీ ఆపరేషన్స్‌ సమయంలో త్రివిధ దళాలకు ఈ EOS-09 ఉపగ్రహం సాయపడుతుంది. 2022లో ప్రయోగించిన ఈఓఎస్‌-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఈఓఎస్‌-09ను పంపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *