Headlines

Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ పశ్చాత్తాపం..

Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ పశ్చాత్తాపం..


బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బుధవారం విచారణకు హాజరైనా ప్రకాష్‌ రాజ్‌ను దాదాపు ఐదు గంటల పాటు ఈడీ విచారించింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీలపై విచారణ జరిపి.. ప్రకాష్‌రాజ్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు ఈడీ అధికారులు. దుబాయ్‌కి సంబంధించిన బెట్టింగ్‌ యాప్స్‌ నుంచి లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన ఈడీ.. ప్రకాశ్‌రాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే జంగిల్‌ రమ్మీ యాప్‌ను ప్రమోట్‌ చేసిన ప్రకాష్‌రాజ్.. రమ్మీ యాప్‌ ద్వారా తనకు ఒక్క పైసా కూడా రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. విచారణ అనంతరం తెలియక ఒకే ఒక్క యాప్‌ ప్రమోట్‌ చేశానని… ఇకపై  బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్‌ చేయన్నారు. బెట్టింగ్ ఆడి ఎవరూ మోసపోవద్దని సూచించారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్‌తో పాటు మొత్తం 29 మందికి నోటీసులు పంపింది ఈడీ. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్‌, సైబరాబాద్‌, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన FIRల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *