గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో సైప్రస్ స్టాక్‌ఎక్స్చేంజ్ ఏర్పాటు అవుతోంది. ఈ మేరకు మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు, టర్కీ ఎక్స్చేంజ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. సైప్రస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్‌లో జరిగిన బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ అంశం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గిఫ్ట్ సిటీ ఒక అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు.
రెండు దేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్-సైప్రస్ మధ్య ఆర్థిక రంగంతోపాటు, పలు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారత్-సైప్రస్-గ్రీస్ కలిసి వ్యాపార, పెట్టుబడుల కౌన్సిల్ ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతిస్తుంచారు. గిఫ్ట్ సిటీలో సైప్రస్ స్టాక్‌ఎక్స్చేంజ్ ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకోవడానికి సహకరించిన ప్రధాని మోదీకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ CEO ఆశిష్ చౌహాన్ ధన్యవాదాలు తెలిపారు.
At the Business Roundtable Meeting in Cyprus, PM @narendramodi highlighted GIFT City as a rising global financial hub.
He welcomed the collaboration between NSE and the Cyprus Stock Exchange at GIFT City, encouraged deeper tourism cooperation and applauded the formation of the… pic.twitter.com/9v5Fs7Q5PQ
— MyGovIndia (@mygovindia) June 15, 2025
Press Release: NSE International Exchange (NSE IX) signs strategic MoU with Cyprus Stock Exchange to enable Cross and Dual Listings and to enhance bilateral Capital Market Collaboration during the visit of Prime Minister of India Shri Narendra Modi ji to Cyprus.
Follow the Link… pic.twitter.com/0eyKweJthn— NSE India (@NSEIndia) June 16, 2025
Thank you @pmoindia Shri @narendramodi ji for your interaction with business community yesterday at Cyprus and appreciating the collaboration between @nse_ix at Gift city Gujarat and Cyprus Stock Exchange. https://t.co/SXJNpSFrVk pic.twitter.com/ZCRUuvdBQn
— Ashish Chauhan (@ashishchauhan) June 16, 2025
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి