హిందూ మతంలో దేవతల మాదిరిగానే, మన పూర్వీకులను కూడా పూజిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఆనందం, శాంతి, శుభ కార్యాలలో పూర్వీకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం, పూర్వీకులు పితృలోకంలో నివసిస్తారు. పితృ పక్షంలో 15 రోజులు భూమి మీదకు వస్తారు. ఈ రోజుల్లో శ్రాద్ధ కర్మలు, తర్పణం, అర్పణం, దానం మొదలైనవి పూర్వీకుల కోసం చేస్తారు. పితృ పక్షంలో పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం మొదలైనవి చేయడం ద్వారా వారి ఆత్మ శాంతిస్తుందని తమ వారసులను ఆశీర్వదిస్తారని చెబుతారు. ఈ సంవత్సరం పితృ పక్ష ప్రారంభంలో యాదృచ్చికంగా గ్రహణం ఏర్పడనుంది. గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
పితృ పక్ష ప్రారంభం రోజున గ్రహణం
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం 2025 సెప్టెంబర్ 7న పౌర్ణమి తిథి నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో పితృ పక్షం సెప్టెంబర్ 21న సర్వ పితృ అమావాస్య రోజుతో ముగుస్తుంది. పితృ పక్షం ప్రారంభమయ్యే సెప్టెంబర్ 7న.. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరంలో చివరి చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించనుంది.
ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
భారత కాలమానం ప్రకారం ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ గ్రహణం సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ చంద్ర గ్రహణం ప్రభావం 3 గంటల 29 నిమిషాల పాటు ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కానుంది. ఈ గ్రహణం భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో కనిపిస్తుంది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణ సూత కాలం సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 12:57 నుంచి ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పౌర్ణమి రోజున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
గ్రహణ సమయంలో శ్రాద్ధ కర్మలు చేయాలా..? వద్దా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. కనుక ఈ సమయంలో శ్రాద్ధ కర్మలు చేయడం అశుభకరం. గ్రహణ సమయంలో శ్రాద్ధ కర్మలు చేయడం గురించి ఆందోళన చెందుతుంటే, గ్రహణ సూతక కాలం ముగిసిన తర్వాత శుభ సమయంలో శ్రాద్ధ కర్మలు చేయవచ్చు. గ్రహణ సమయంలో శ్రాద్ధ కర్మలు చేయడానికి పండితులను కూడా సంప్రదించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.