పర్సనల్ లోన్స్‌పై వడ్డీ చెల్లింపులు చేయని వ్యక్తులు అనేక ఆర్థిక, చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ లోటును ఎదుర్కొన్నప్పుడల్లా వ్యక్తిగత ఖర్చులను భరించటానికి వ్యక్తిగత రుణం సహాయపడుతుంది. వ్యక్తిగత రుణాలు సాధారణంగా పూచీకత్తు లేని స్వభావం కలిగి ఉండటం వల్ల రుణదాతలు అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే వ్యక్తిగత రుణం సరిగ్గా రుణం చెల్లింపు చేయకపోతే మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. మీరు మీ వ్యక్తిగత రుణాలను చెల్లించకపోతే రుణదాతలు మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించమని క్రెడిట్ బ్యూరోలను అభ్యర్థిస్తారు. మీ క్రెడిట్ స్కోర్ తగ్గిన తర్వాత దాన్ని మెరుగుపరచడం కష్టం అవుతుంది.
ఆలస్య రుసుములు, జరిమానాలు
సమయానికి వక్తిగత రుణాలు చెల్లించకపోతే రుణదాతలు భారీగా ఆలస్య రుసుములను విధిస్తారు, ఇది మీ బకాయి మొత్తాన్ని పెంచుతుంది. అలాగే చెల్లించని రుణాలకు అదనపు వడ్డీ కట్టాల్సిఉంటుంది. అలాగే రుణదాతలు మీ కేసును వసూళ్ల ఏజెన్సీకి బదిలీ చేయవచ్చు.
చట్టపరమైన చిక్కులు
మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు లేదా ఏజెన్సీలో తిరిగి చెల్లింపు కోసం కోర్టులో దావా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే మీ వేతనం నుంచి లేదా మీ ఆస్తి జప్తు చేసి రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంటి.
ఇవి కూడా చదవండి
లోన్ రీకాల్
కొంతమంది రుణదాతలు పూర్తి మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయవచ్చు. మీరు సమస్యను పాటించడంలో విఫలమైతే చట్టపరమైన సహాయం తీసుకోవచ్చు.
కొలేటరల్ నష్టం
- మీరు సెక్యూర్డ్ రుణమైతే రుణదాత కారు లేదా ఆస్తి వంటి తాకట్టు పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు.
భారతదేశంలో తమ వ్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే రుణగ్రహీత ఐపీ కోసం దాఖలు చేయవచ్చు. అయితే భారతదేశంలో దివాలా కోసం దాఖలు చేసే ప్రక్రియ సుదీర్ఘమైనదిగా ఉంటుంది. అలాగే రుణగ్రహీత దివాలా ప్రక్రియలను పర్యవేక్షించడానికి దివాలా నిపుణులను నియమిస్తున్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా కోసం పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి