Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రీ రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ తొలిప్రేమ

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రీ రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ తొలిప్రేమ


టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఇప్పుడు రీ రిలీజ్ ల హవానే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నిజానికి కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రీ రిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు సినిమాలను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే.. థియేటర్స్ లో సినిమాలోని సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. మొదట్లో పాటలకు డాన్స్ లు వేసి వైరల్ చేశారు. ఆతర్వాత ఇప్పుడు సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు రే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ అదరగొడుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు విడులై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే మహేష్ బాబు ఖలేజా సినిమా విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

పవన్ కళ్యాణ్ నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా తొలిప్రేమ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయనున్నారు. తొలిప్రేమ సినిమాను జూన్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ఫ్యాన్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *