ఉగ్రవాద దాడుల కారణంగా చాలా మంది కశ్మీర్ వెళ్లడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన పహల్గామ్ దాడితో వేసవిలో కశ్మీర్ టూర్ కు ప్లాన్ చేసుకున్న వారు కూడా వెనకడుగు వేస్తున్నారు. తమ టూర్లు, వెకేషన్ ప్లాన్స్ ను రద్దు చేసుకుంటున్నారు. దీంతో పర్యాటక రంగంపైనే ఆధారపడి బతుకీడుస్తోన్న కశ్మీరీలు ఆదాయలం లేక కన్నీరు మున్నీరవుతున్నారు. పర్యాటకులు కశ్మీర్ రావాలని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఏదైనా జరిగితే తమ ప్రాణాలను అడ్డేస్తామని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు అతుల్ కులకర్ణి కశ్మీర్‌కు వెళ్లి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చారు.
ముంబై నుంచి శ్రీనగర్ వెళ్లిన అతుల్ తన పర్యటనకు సంబంధించిన విశేషాలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మొదట ముంబై నుంచి శ్రీనగర్ కు ప్రయాణిస్తున్నప్పుడు విమానం నుంచి తీసిన ఫోటోను పోస్ట్ చేశారు. ‘ఏప్రిల్-మే నెలల్లో కశ్మీర్ పర్యాటకులతో నిండిపోతుంది. కానీ పహల్గామ్ దాడి తర్వాత విమానం ఖాళీగా ఉంది. ఈ విమానం ఎప్పుడూ ప్రయాణీకులతో నిండి ఉండేది. మనం ఈ సీట్లను తిరిగి భర్తీ చేయాలి’ మనం ఉగ్రవాదాన్ని ఓడించాలి’ అని ధైర్యం నూరి పోశాడు అతుల్.
అనంతరం పహల్గామ్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న ఫొటోలను షేర్ చేసిన నటుడు.. ‘ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను ఇక్కడకు వచ్చాను. మరి మీరు కూడా రండి’ అని అతుల్ కులకర్ణి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
కశ్మీరీలతో క్రికెట్ ఆడుతోన్న అతుల్ కులకర్ణి..
#ChaloKashmir #Feet_in_Kashmir #Kashmiriyat #love_compassion #DefeatTerror pic.twitter.com/0goqybpP9R
— atul kulkarni (@atul_kulkarni) April 27, 2025
కాగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషా సినిమాల్లో నటించాడు అతుల్ కులకర్ణి. తెలుగులో జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో తదితర సినిమాల్లో నటించారు అతుల్ కులకర్ణి.
పహల్గామ్ అందాలను ఆస్వాదిస్తూ..
हिंदोस्तां की ये जागीर है
के डर से हिम्मत भारी हैहिंदोस्तां की ये जागीर है
के नफ़रत प्यार से हारी हैचलिए जी कश्मीर चलें
सिंधु, झेलम किनार चलें#ChaloKashmir #Feet_in_Kashmir #Kashmiriyat #love_compassion #DefeatTerror pic.twitter.com/ateMnb1Ym4— atul kulkarni (@atul_kulkarni) April 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.