Pahalgam Terror Attack: తాను విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు.. హిందువునని చెప్పెలోపే!

Pahalgam Terror Attack: తాను విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు.. హిందువునని చెప్పెలోపే!


Pahalgam Terror Attack: తాను విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు.. హిందువునని చెప్పెలోపే!
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

సుదీప్‌ కుటుంబ సభ్యలు ప్రకారం..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో భారతీయులతో పాటు నేపాల్‌కు చెందిన 27 ఏళ్ల సుదీప్ న్యూపానే కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే సుదీప్‌ మృతి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు అతడిని భారతీయ హిందువు అనుకొని పొరబడి కాల్చి చంపారని.. కనీసం అతనికి తన జాతీయతను చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు సుదీప్‌ను మతం గురించి అడిగారని.. తాను హిందువునని చెప్పగానే అతన్ని కాల్చి చంపారని తెలిపారు. కనీసం తాను భారతీయుడిని కాదని..నేపాలీనని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.

నేపాల్‌ లుంబిని ప్రావిన్స్‌లోని బుత్వాల్‌కు చెందిన సుదీప్‌ న్యూపానే విడాకులు తీసుకున్న తన తల్లికి ఉపశమనం కలిగించేందుకు ఈ నెల 19న తల్లి రీమా, సోదరి సుష్మ, బావమరిది ఉజ్వల్‌తో కలిసి కాశ్మీర్‌ పర్యటనకు వచ్చారు. రెండ్రోజుల పాటు ఆ ప్రాంతం మొత్తం తిరిగారు. ఇక 21వ తేదీనా గడ్డి మైదానంలో నడుస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. అయితే ఉగ్రవాదులు సుదీప్‌ను కాల్చే ముందు అతని మతం గురించి అడిగారని.. అప్పుడు సుదీప్‌ తాను హిందవునని సమాధానం ఇచ్చాడని.. ఇంకేమి చెప్పకముందే అతనిపై కాల్పులు జరిపారని సుదీప్‌ మామ చెప్పారు. అతనికి కనీసం తాను వీదేశీయుడినని..తనది భారత్‌ కాదు నేపాల్‌ అని చెప్పుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి అతను భారత్‌ నుంచి పరిహారం కోరుతున్నట్టు తెలుస్తోంది.

అయితే సుదీప్‌ మృతదేహాన్ని బుధవారం సాయంత్రం శ్రీనగర్ నుండి న్యూఢిల్లీకి విమానంలో తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాత్రి లక్నోకు తరలించారు. అక్కడి నుండి భూమార్గాన సునౌలీకి తీసుకెళ్లారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక జిల్లా మేజిస్ట్రేట్ మృతదేహంతో పాటు సరిహద్దు వరకు వెళ్లి సునౌలీ వద్ద, సుదీప్‌ మామకు అతని మృతదేహాన్ని అందించారు. అక్కడి నుంచి పోలీసు ఎస్కార్ట్ వాహనంలో సుదీప్‌ మృతదేహాన్ని కలికనగర్‌కు చేర్చారు. దాదాపు మూడు రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దు దాటి ప్రయాణించిన తర్వాత సుదీప్‌ మృతదేహాం తన ఇంటికి జాతీయ జెండాతో కప్పబడి చేరుకుంది. దీంతో అతని అంత్యక్రియలు జరిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *