
Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది సంఖ్యలో తరలిరావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి మారుమోగిపోతుంది. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుండి పంబ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. ఇక క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. మండల…