
TTD: నలుగురు టీటీడీ ఉద్యోగులపై సస్సెన్షన్ వేటు.. కారణం ఇదే!
తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను టీటీడీ బోర్డు సస్పెండ్‌కు చేసింది. వీరు టీటీడీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కారవడంతో టీటీడీ చర్యలు తీసుకుంది. టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న ఎస్.రోసి, గ్రేడ్ -1 ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి.అసుంతలను టీటీడీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ…