
komatireddy: హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై మంత్రి కీలక ప్రకటన!
హైదరాబాద్ నగర వాహనదారులకు శుభవార్త. నగరంలోని ప్రముఖ ఎలివేటెడ్ కారిడార్‌లలో ఒకటైన ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు మంత్రి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి కారిడార్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని.. అయితే ఈ ఏడాది దసరా నాటికి కారిడార్‌ను ప్రజల వినియోగానికి…