OTT Movies: సందడే సందడి.. త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

OTT Movies: సందడే సందడి.. త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లివే


ఓటీటీ సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జియో సినిమా, సోనీ లివ్.. ఇలా అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఇందుకు సంబంధించి ముందుగానే ఆడియెన్స్ కు అప్డేట్స్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 2025 లో విడుదలయ్యే సిరీస్‌లు, సినిమాలను అధికారికంగా ప్రకటించింది. 2024లో నెట్‌ఫ్లిక్స్ పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు, సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. కొన్నింటిని నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయగా, మరికొన్ని థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ సంవత్సరం కూడా నెట్‌ఫ్లిక్స్‌లో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

సినిమాలు

  • టెస్ట్- మాధవన్, నయనతార, సిద్ధార్థ్
  • జ్యుయెల్ థీఫ్- సైఫ్ అలీఖాన్
  • టోస్టర్- రాజ్ కుమార్ రావు, సాన్యా మల్హోత్రా
  • ఆప్ జైసా కోయీ- మాధవన్
  • నాదానియా- సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం

వెబ్ సిరీస్ లు

  • రానా నాయుడు 2- వెంకటేశ్, రానా
  • అక్క- కీర్తి సురేశ్, రాధికా ఆప్టే
  • సూపర్ సుబ్బు- సందీప్ కిషన్
  • కోహ్రా సీజన్ 2
  • ఢిల్లీ క్రైమ్ సీజన్ 3
  • మండలా మర్డర్స్
  • ది రాయల్స్

ఇవి కూడా చదవండి

టీవీ షో

  • ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3

‘ఢిల్లీ క్రైమ్’ సూపర్ హిట్ సిరీస్‌లలో ఒకటి. దీని మూడవ సీజన్ ఈ సంవత్సరం ప్రసారం అవుతుంది. రానా నటించిన ‘రానా నాయుడు’ రెండవ సీజన్ ఈ సంవత్సరం ప్రసారం కానుంది. ‘స్క్విడ్ గేమ్ 3’ కూడా ప్రసారం అవుతుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతాయి. వీటిలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, సూర్య ‘రెట్రో’, రవితేజ ‘మాస్ జాతర’, నాగ చైతన్య ‘తందేల్’, నాగ చైతన్య ‘తండేల్’, నాని ‘హిట్ 3’ ఉన్నాయి

He’s super unlucky. He’s super awkward. He’s super Subbu.

Super Subbu is coming soon, only on Netflix.#SuperSubbu#SuperSubbuOnNetflix#NextOnNetflixIndia pic.twitter.com/4YW7hf5XLf

— Netflix India (@NetflixIndia) February 3, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *