OTT Movie: 28 కోట్లతో తీస్తే 200 కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలో దృశ్యంను మించిన సస్పెన్స్ థ్రిల్లర్ 

OTT Movie: 28 కోట్లతో తీస్తే 200 కోట్లకు పైగా కలెక్షన్లు.. ఓటీటీలో దృశ్యంను మించిన సస్పెన్స్ థ్రిల్లర్ 


మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితేమే ఎల్2 ఎంపురాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మలయాళంలో అత్యధిక వసూళ్ల సినిమా రికార్డును బ్రేక్ చేశాడు. ఇది మరవకముందే మరో బ్లాక్ బస్టర్ తో మన ముందుకొచ్చాడీ కంప్లీట్ స్టార్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా తుడరుమ్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపిస్తోంది. ఏప్రిల్ 25న మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు 200 కోట్లు దాటి పోయాయి. తెలుగులోనూ ఈ మూవీకి మంచి వసూళ్లే దక్కాయి. సరిగ్గా ప్రమోషన్స్ చేసి ఉంటే మరిన్ని కలెక్షన్లు దక్కేవంటున్నారు ట్రేడ్ నిపుణలు. మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో మోహన్ లాల్ కు జంటగా శోభన నటించింది. దృశ్యం మూవీ తరహాలోనే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ గా తుడరుమ్ తెరకెక్కింది. ఇప్పటికీ మలయాళంలో ఈ మూవీకి హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తుడరుమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజైన నెలరోజుల తర్వాత సినిమాను స్ట్రీమింగ్ చేయాలని డీల్ కుదిరింది. అంటే మే 23 లేదా 30వ తేదీల్లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్లలోనే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. కాబట్టి స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.

జియో హాట్ స్టార్ చేతిలో తుడరుమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు..

రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కిన తుడరుమ్ సినిమాలో పలువురు సినీ ప్రముఖులు నటించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *