ప్రతి వారాంతంలో ఓటీటీలోకి వివిధ జానర్, విభిన్న కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ విడుదలవుతుంటాయి. హారర్, కామెడీ, మిస్టరీ, థ్రిల్లర్ మూవీస్ వరకు అనేక చిత్రాలు సినీప్రియులను అలరిస్తుంటాయి. అడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇన్నాళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండింగ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ అంతకుమించిన రెస్పాన్స్ వస్తుంది. దాదాపు 2 గంటల 36 నిమిషాలపాటు సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏంటో తెలుసుకుందామా. అదే హిట్ 3.
ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా కలిసి నటించిన సికందర్ సినిమాను అధిగమించి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
గతంలో సూపర్ హిట్స్ అయిన హిట్ 1, 2 చిత్రాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ హిట్ థర్డ్ కేస్ సినిమా అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంది. ఇందులో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించగా.. ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాక్షన్ హీరోగా కనిపించాడు నాని. అలాగే ఈ చిత్రంతో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు నాని.
హిట్ 3 చిత్రంలో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు నాని. ప్రమాదకరమైన హంతకులు భూమిపైన ఉండేందుకు అర్హులు కాదంటూ అర్జున్ సర్కార్ తీసుకునే చర్యలు, అతడి కఠినమైన వైఖరి, కేసులను పరిష్కరించే విధానాలు అతడికి ఎలాంటి సమస్యలను తెచ్చిపెడతాయి అనేది సినిమా. 64 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం రూ.124 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గవ చిత్రంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..